దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరోవైపు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
మరోవైపు, ఢిల్లీలో జామా మసీదు వద్ద శుక్రవారం జరిగిన ఆందోళన ప్రదర్శనలో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. మళ్లీ తప్పించుకున్న ఆజాద్‌ను ఇవాళ అరెస్టు చేశారు.