పదో తరగతిలో 33 శాతం మార్కులొస్తే పాస్... ఎక్కడ?

గురువారం, 1 మార్చి 2018 (17:10 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్‌ మార్కుల విషయంలో సీబీఎస్ఈ ఈమేరకు సడలింపు ఇచ్చింది. వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు థియరీలోనూ, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లోనూ కలిపి మొత్తం 33 శాతం మార్కులు తెచ్చుకుంటే పాసైనట్లుగా ప్రకటిస్తారు. 
 
ఈ సడలింపు ఈ యేడాది పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరిమితమని సీబీఎస్ఈ స్పష్టంచేసింది. విద్యార్థులు బోర్డు పరీక్షలలో, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లలో విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవలసి అవసరం లేదని సీబీఐఎసఈ పేర్కొంది. సీబీఎస్ఈ ఎగ్జామినేషన్‌ కమిటీ ఫిబ్రవరి 16వ తేదీన సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు