వచ్చే యేడాది 2025 మార్చి / ఏప్రిల్ నెలలో జరిగే 10, 12 తరగతులకు చెందిన పబ్లిక్ పరీక్షలను నిఘా నీడిలో నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు నిర్వహించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. 2025 జరుగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అందులో పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
కాగా, సీబీఎస్ఈ 2025 నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు భారత్తో పాటు 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మందంి విద్యార్థులు హాజరువుతారని అంచనా వేసింది. ఈ మేరకు పెద్దఎత్తున వసలి కల్పించాలని సుమారు 8 వేల పాఠశాలల్ని పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసింది. వాటిలో సీసీటీవీ నిఘాని తప్పనిసరిచేస్తూ ఆయా పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. సీసీటీవీ సౌకర్యం లేని ఏ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా పరిగణించబోమని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే, రికార్డు ఫుటేజీని సంబంధింత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుంది. ఈ ఫుటేజీని పరీక్షా ఫలితాలు వెల్లడైన రెండు మూడు నెలల వరకు భద్రంగా ఉంచుతారు. ప్రతి పది గదులకు లేగా 240 మంది విద్యార్థుల బాధ్యత తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించనుంది. కొత్తగా తీసుకొచ్చిన సీసీటీవీ విధానం ద్వారా పారదర్శకత, పర్యవేక్షణ సామర్థ్యాలు పెరుగుతాయని సీబీఎస్ఈ భావిస్తుంది. వీటి సాయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలను సాఫీగా నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది.