కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యాజమానులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలో పేరు, చిరునామా మార్పు లాంటీ 15 రకాల సేవలను ఇక సుంచి సులభంగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఆధార్ ఉండాల్సిందే. ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా పలు రకాల సేవలకు రానున్న రోజుల్లో ఆధార్ తప్పనిసరి కాబోతోంది.