పరాయి వ్యక్తి భార్య కోసం ఇద్దరి ప్రాణాలు తీసి జైలుపాలయ్యాడు...

శుక్రవారం, 3 మే 2019 (09:58 IST)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ వ్యక్తిని జైలుపాల్జేసింది. పరాయి వ్యక్తి భార్య కోసం ఆశపడిన ఓ వ్యక్తి.. మద్యంలో విషం కలిపి ఇచ్చాడు. దీంతో తన ప్రియురాలి భర్తతో పాటు మరో వ్యక్తి భార్య కూడా చనిపోయింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం దళితవాడకు చెందిన గోపి (38) అనే వ్యక్తికి భార్య పరిమళ ఉంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన వేలాయుధం (40) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. గోపికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీన్ని వేలాయుధ తనకు అనుకూలంగా మలచుకుని పరిమళతో గుట్టుచప్పుడుకాకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ముఖ్యంగా, రాత్రి సమయంలో గోపికి పీకల వరకు మద్యం తాపించి, ఆ తర్వాత పరిమళతో శృంగార కోర్కెలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని గోపి పసిగట్టి, భార్యతో గొడవపడ్డాడు. ఫలితంగా ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో పరిమళకు వేలాయుధం ఫోన్ చేసి... తిరగి భర్త వద్దకు రావాలంటూ ఒత్తిడి చేయగా, భర్త ఉంటే తాను తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో గోపిని ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం గోపీకి స్నేహితుడై మేఘవర్ణం (35)ను పావుగా వాడుకున్నాడు. ఓ రోజు మద్యంలో విషం కలిపి మేఘవర్ణంకు ఇచ్చాడు. అందులో విషం కలివుందన్న విషయం తెలియని మేఘవర్ణం తన స్నేహితుడు గోపికి ఇచ్చాడు. 
 
గోపి తాగగా మిగిలిన మద్యాన్ని మేఘవర్ణం ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాడు. మేఘవర్ణం భార్య మాధవి (28) ఫ్రిజ్ తెరువగా అందులో మద్యం సీసా కనిపించింది. దీంతో ఆమె కూడా ఆ మద్యాన్ని సేవించింది. విష ప్రభావంతో కొంతసేపటికే కేకలు వేసి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇంటికి వచ్చిన మేఘవర్ణం ఆమెను నగరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. 
 
మరోవైపు మంగళవారం రాత్రి 10 గంటలకు అపస్మారకస్థితిలో ఉన్న గోపిని గుర్తించిన స్థానికులు అతను మృతి చెందినట్లు గుర్తించారు. మేఘవర్ణం వెంటనే గోపి ఇంటికి వెళ్లగా అప్పటికే అతను ఇంటిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు నిందితుడు వేలాయుధం అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు