నడిరోడ్డుపై గుడ్లు పెట్టిన నాగుపాము.. వీడియో వైరల్ (video)

సోమవారం, 6 మే 2019 (14:30 IST)
అడవుల్లో లేదా పొదల్లో నాగుపాములు గుడ్లు పెడుతాయి.  కానీ ఇలా నడి రోడ్డుపైకి వచ్చిన ఓ నాగుపాము గుడ్లను పెట్టడం అరుదు. అలాంటి ఘటన జరిగింది. నడిరోడ్డుపై నాగుపాము గుడ్లు పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... 1.21 నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
నడిరోడ్డుపై ఇలా పాము గుడ్లు పెట్టడాన్ని గమనించిన ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌లో ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ వీడియో షేక్ చేస్తోంది. ప్రసన్న అనే ఓ ఉపాధ్యాయుడు తీసిన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వార్త ట్రెండింగ్ అయ్యింది. 
 
రోడ్డుపై వెళ్తుండగా పాము కనిపించిందని.. అప్పుడే ఆ పాము గుడ్లను పెడుతుండటాన్ని గమనించానని పాములోరికి ఈ విషయం తెలిపానని ప్రసన్న చెప్పారు. అడవికి పక్కనే వున్న రోడ్డుపై ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ పాము 14 గుడ్లను పెట్టింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు