కోవిడ్ బారిన పడి 1000 మందికి పైగా బ్యాంక్ ఉద్యోగులు మృతి

సోమవారం, 17 మే 2021 (22:25 IST)
కోవిడ్ బారిన పడి 1000కి పైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ చెప్పారు. బ్యాంకులు కేసులు, మరణాలకు సంబంధించి సరైన సంఖ్య చెప్పట్లేదని, మరింత ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అన్నారు. 
 
బ్యాంకు ఉద్యోగులకే కాకుండా..బీమా సంస్థల ఉద్యోగులకూ కరోనా ప్రమాదం ఎక్కువగా ఉందని, వారికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి దేవశీష్ పాండా రాష్ట్రాలకు లేఖ రాశారు. 
 
ఇప్పటిదాకా 1,200 మంది దాకా ఉద్యోగులు చనిపోయారని ఆలిండియా బ్లాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు