ఈ తర్వాత యాస్ తుఫాను సమీక్ష సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతుంది. బెంగాల్లో నిర్వహించే సమీక్షా సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. కాగా, తుఫాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
రెండు రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని పేర్కొంది. ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. ఇలావుండగా యాస్ తుఫాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. యాస్ తుఫాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.