చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి.. రైళ్లు నడిపే యోచనలో నాసా!

సెల్వి

మంగళవారం, 14 మే 2024 (22:22 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని యోచిస్తోంది. రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ (ఫ్లోట్) అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. 
 
సంప్రదాయ రైళ్ల వ్యవస్థలో సాధారణంగా తలెత్తే చక్రాలు, ట్రాకుల సవాళ్లను అధిగమించడంలో మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది.
 
ట్రాక్‌పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబో‌లను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేస్తారు. ట్రాక్‌ను రైలు తాకకుండా ఈ రోబో‌లు నిరోధిస్తాయి. తద్వారా రైలు సజావుగా తేలుతూ ప్రయాణిస్తుంది. 
 
ఒక భారీ స్థాయి ఫ్లోట్ వ్యవస్థ రోజుకు 100,000 కిలోల పేలోడ్‌ను చాలా కిలోమీటర్లకు పైగా దూరం తరలించగలదని నాసా వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు