ఇండిగో ఫ్లైట్‌కు టేకాఫ్ సమస్య... మంత్రి నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు

మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:43 IST)
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. 
 
ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. ఇక విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దించేశారు. సాంకేతిక లోపాన్ని ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులందరూ నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు