మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవితకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. ఇప్పటికే ఆమె వ్యక్తిగత ఆడిటర్ నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఆ తర్వాత కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కరోనా వైరస్ బారినపడి హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నోటీసును ఆమె సహాయకుల ద్వారా కవితకు పంపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాములో ఈడీ అధికారులు దూకుడుంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు, ఈడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, నెల్లూరులతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. వీరిలో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.