ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. దీంతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ తరపున అల్కా లాంబా, బీజేపీ నేత రమేశ్ బిధూరి ఎన్నికల బరిలోకి దిగారు.
కాగా, తన ఆస్తుల విలువ రూ.76,93,347గా అతిశీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని తెలిపారు. తనకు కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందన్నారు. తనకు సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు. రెండు పరువునష్టం కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. అయితే, గత 2020లో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అతిశీ ఆస్తులు రూ.17 లక్షలుగా ఉంటే ఇపుడు ఈ ఆస్తులు రూ.76 లక్షలకు పెరగడం గమనార్హం.