ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు బలి.. హ్యాపీగా మాట్లాడుతూ వుంటే? (video)

సెల్వి

సోమవారం, 19 ఆగస్టు 2024 (17:15 IST)
Delhi
ఢిల్లీలో ఏసీ మీద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడికి గాయాలైనాయి. ఆగస్ట్ 17 శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో జితేష్ చద్దా అనే యువకుడు ఒక ఆగి ఉన్న స్కూటర్‌పై కూర్చుని తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎయిర్ కండీషనర్ యొక్క ఔట్ డోర్ యూనిట్ పైనుండి పడింది. 
 
ఈ ఘటనతో తీవ్రగాయపడిన యువకులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో 18 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక మృతుడి స్నేహితుడు చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

ఢిల్లీలో ఏసీ మీద పడి 18 ఏళ్ల యువకుడు మృతి.. మరో యువకుడికి గాయాలు. pic.twitter.com/wWHKpa1iQR

— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు