ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (16:14 IST)
ఢిల్లీ అల్లర్లలో బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. చనిపోయిన వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు, షాప్‌లు అల్లర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలిస్తామన్నారు. 
 
దాడుల్లో చాలామంది రిక్షావాలాలపై అటాక్ జరిగింది. రిక్షాలను కూడా ధ్వంసం చేశారు. రిక్షా కోల్పోయిన వారికి 25 వేలు, e-రిక్షాకు 50 వేలు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి ఒక్కో జంతువుకు 5 వేలు ప్రభుత్వం ఇస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైన వారిలో కిరాయికి ఉన్న వాళ్లు ఉంటే వారికి రూ. లక్ష ఇవ్వనున్నారు. గాయపడిన వారందరికి మెడికల్ బిల్లుల్ని ప్రభుత్వమే కడుతుందన్నారు. బాధితులందరికీ మామూలు పరిస్థితి నెలకొనే వరకు ఫ్రీగా ఫుడ్ అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు