రెండు తలల నాగుపాము.. డుంజో బ్యాగులో పెట్టి అమ్మేయాలనుకున్నారు..

గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:18 IST)
snake
డుంజో డెలివరీ బాయ్‌తో పాటు అతడి స్నేహితుడిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ వాళ్లేమి చేశారంటే..? రెండు తలల పామును రూ.50లక్షలకు విక్రయించాలని ప్రయత్నించారు. అంతే పోలీసులకు దొరికిపోయారు. నిందితులను బ్యానర్‌ఘట్ట రోడ్డుకు చెందిన గురప్పనపాల్యకు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (26), అజార్ ఖాన్(27)గా గుర్తించారు. 
 
బోయిడే కుటుంబానికి చెందిన రెండు తలల పామును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ పామును శాండ్ బోవా అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాముకు మంచి డిమాండ్ ఉందని, రూ.50 నుంచి రూ.60 లక్షల ధర పలుకుతోందని అన్నారు. ఈ పామును ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని, అలాగే అది ఉంటే అదృష్టమని కూడా కొందరు విశ్వసిస్తారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి స్కూటర్, మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
 
రిజ్వాన్ డుంజో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని, అజర్ ఖాన్ అతడి స్నేహితుడని పోలీసులు తెలిపారు. పామును డుంజో బ్యాగ్ (ట్రావెల్ కిట్)లో ప్యాక్ చేసి అమ్మడానికి ప్రయత్నించినట్టు చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆహారం, ఇతర నిత్యావసర సర్వీసులకు అనుమతి ఇచ్చిందని, దీనిని వీరు పామును తరలించేందుకు అవకాశంగా మార్చుకున్నారని పాటిల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు