అన్ని డిపార్ట్ మెంట్లలోని అధికారులు, ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసులకు రావడానికి సంబంధించి పలు సూచనలతో ఓ ఆర్డర్ జారీ చేసింది.
ఒకవేళ బ్లూటూత్ ప్రాక్సామిటీ(పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్) ఆధారంగా యాప్లో స్టేటస్ ను మోడరేట్ లేదా హైరిస్క్ గా చూపినట్లయితే ఆ ఏరియాల్లో ఉన్న వారు ఆఫీసులకు రావొద్దని, 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని, మళ్లీ స్టేటస్ సేఫ్ లేదా లో రిస్కు వచ్చిన తర్వాతే బయటకు రావాలని పేర్కొంది.