దేశానికి కావాల్సింది బుల్లెట్ రైళ్లు కాదనీ, సరిహద్దులను కంటికి రెప్పలా కాస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశానికి బుల్లెట్ రైళ్లు అవసరం లేదన్నారు. కానీ, సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులతో దేశ రక్షణలో ఉండే పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నారు.
పూల్వామా ఉగ్రదాడికి దేశ నిఘా వ్యవస్థ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఇలా ఎందుకు తయారవుతుందని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. అన్ని పార్టీలు తమ రాజకీయ వ్యవహారాలను పక్కనపెట్టి, సురక్షితమైన సరిహద్దు కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించాలన్నారు.