అమెరికా అధ్యక్షుని హోదా ఆ ఇద్దరికీ దక్కకూడదు అనుకుంటున్నారు.. ఆ దేశపు యువత. దాదాపు నాలుగో వంతు ఉల్కాపాతం జరిగి భూగోళం నాశనమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకూడదని అమెరికా యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇందుకు అధ్యక్షుడి ఎంపిక విషయంలో అవకాశాలు పరిమితంగా ఉండటమే ప్రధాన కారణం.
ఉల్కాపాతం జరిగి భూగోళం బద్దలవ్వటాన్ని అయినా ఇష్టపడతాం కానీ ట్రంప్, హిల్లరీలను శ్వేతసౌధానికి వెళ్లనివ్వమని అమెరికా యువతలో ప్రతి నలుగురిలో ఒకరు చెప్తున్నారు. ఈ విషయంలో యుమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ కో డైరెక్టర్ జోషు డైక్ తెలిపారు. దీనికోసం ట్విట్టర్లో జెయింట్మెటియోర్2016 హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. దీనిలో వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.