భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా తొలి దశలో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఈ డీల్‌లో భాగంగా మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా నేడు ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఐదు విమానాలు బుధవారం మధ్యాహ్నం భారత గడ్డను ముద్దాడాయి. దీంతో యావత్ భారత్ పులకించిపోయింది.
రాఫెల్ విమానాలు భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయన్నారు. ఈ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని, ఇకపై పొరుగు దేశాల నుంచి రెచ్చగొట్టడాలు ఉండవని పేర్కొన్నాడు.