రైళ్లలో ఇక వినోదం

ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:40 IST)
రైలు ప్రయాణంలో ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం పైసా ఖర్చు చేయనవసరం లేదని, మొబైల్ డేటా కూడా అవసరంలేదని ప్రకటించింది.

భారతీయ రైల్వే తాజాగా ‘ఎంటర్‌టైన్ మెంట్ ఆన్ డిమాండ్’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. అయితే ఈ సదుపాయం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం పట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో మరో 6 రైళ్లలో ఈ విధమైన సేవలు ప్రారంభం కానున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్ డిమాండ్ సేవలు ఉలివ్ ప్లేయర్ మాధ్యమంతో ప్రయాణికుల డివైజ్‌లో స్ట్రీమ్ అవుతాయి. అయితే దీనిని ప్రయాణికులు గూగుల్ ప్లేయర్ లేదా యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వైఫై ఆధారంగా మీడియా సర్వర్ నుంచి ఒక కోచ్‌లో ఒకేసారి 90 మంద్రి ప్రయాణికులు కనెక్ట్ చేసుకుని తమకు ఇష్టమైన సినిమాలను చూసుకోవచ్చు. ఈ సదుపాయం కింద ప్రయాణికులు 12 వేల ప్రోగ్రాములతో పాటు ఏడు వేల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు