ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం... అజిత్ జోగి కుమారుడు అరెస్టు
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (12:48 IST)
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
అమిత్ జోగి 2013లో జరిగిన ఎన్నికల్లో మర్వాహి స్థానంలో పోటీ చేశారు. ఇందుకోసం ఆయన ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందులో తన పుట్టిన తేదీతోపాటు.. కులాన్ని తప్పుగా ప్రస్తావించారు.
దీంతో జోగి ప్రత్యర్థి, బీజేపీ నాయకురాలు సమీరా పైక్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ సాగింది. ఈ విచారణ తర్వాత అమిత్ జోగిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, జోగి 1977లో టెక్సాస్‌లో జన్మిస్తే.. అఫిడవిట్‌లో మాత్రం 1978లో ఛత్తీస్‌గఢ్‌లోని గౌరీలా గ్రామంలో జన్మించినట్లుగాను, తన కులాన్ని షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)గా పేర్కొన్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.