కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు దేశంలో మొత్తం 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో 21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది.
అయితే, దేశంలో ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.