#GujaratVerdict : సొంత రాష్ట్రంలో మోడీకి ఎదురుగాలి

సోమవారం, 18 డిశెంబరు 2017 (09:43 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణం.. క్షణం ఉత్కంఠతను రేపుతున్నాయి. ముఖ్యంగా, ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎదురుగాలి వీస్తున్నట్టుగా కనిపిస్తోంది. 
 
సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీనే ఆధిక్యం కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుని, ఆధిక్యాన్ని చూపింది. ఉదయం 9.45 గంటలకు బీజేపీ ఏకంగా 92 చోట్ల, కాంగ్రెస్ 85 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తమీద ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని చెప్పొచ్చు. 
 
ఇకపోతే. గాంధీ నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అశోక్ కుమార్ పటేల్ ముందంజలో ఉండగా, రాధాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. అబ్దాసలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్యుమన్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. అంజర్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి అహిర్ గోక్లాబాయ్, పటాన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిరిట్ కుమార్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. విశావదర్, పోర్ బందర్, కుటియానా, మంగ్రోల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు