బెడ్రూమ్‌లో ఆరో భార్య కోఆపరేట్ చేయట్లేదనీ ఏడో పెళ్లి కోసం వృద్ధ భర్త ప్రయత్నాలు!!

బుధవారం, 27 జనవరి 2021 (07:39 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడుకి ఆరో భార్య తేరుకోలేని షాకిచ్చింది. తన భార్య పడక గదిలో సహకరించట్లేదని భావించిన వృద్ధ భర్త.. ఏడో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరో భార్య... పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ వృద్ధ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్‌కు చెందిన ఓ మోతుబరి రైతు అయ్యూబ్ డేగియా గతేడాది సెప్టెంబరులో వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ వితంతువును అతడు పెళ్లాడాడు. ఇది అతనికి ఆరో పెళ్లి. 
 
నిజానికి ఆయనకు అప్పటికే ఐదు పెళ్లిళ్లు జరిగాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆరో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొంతకాలం కాపురం చేసిన తర్వాత భార్యపై వృద్ధ భర్త ఆరోపణలు చేశాడు. పడకగదిలో భార్య సహకరించడం లేదని ఆరోపిస్తూ మరో పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అంతకుమునుపే ఐదు సార్లు వివాహమైనట్టు భర్త తనకు చెప్పలేదని భార్య పోలీసులకు తెలిపింది. పైగా, పెళ్లి సందర్భంగా తనకు ఓ ఇల్లు, కొంత మొత్తం ఇస్తానని చెప్పి ఆ తర్వాత తనను చెల్లెలి ఇంట్లో దిగబెట్టి చేతులు దులిపేసుకున్నాడని కూడా వాపోయింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. 
 
అయితే.. పడగకగదిలో భార్య సహకరించని కారణంగానే తాను మరో పెళ్లికి సిద్ధమైనట్టు అయ్యూబ్ పేర్కొన్నాడు. కాగా.. భార్య ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు