యుద్ధ వీరుడికి అంతిమ వీడ్కోలు... గన్ సెల్యూట్‌తో నివాళులు

సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:29 IST)
'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వీటిని పూర్తి చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌స్కేర్‌లో అధికార లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
 
అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాల అధిపతులు... అర్జన్‌ సింగ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
 
కాగా, 98 యేళ్ళ 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ (98) ఆదివారం కన్నుమూసిన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఆయ‌న‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయ‌న‌ను ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫలితం లేకండా పోయింది. 
 
అర్జన్ సింగ్ 1965 భార‌త్‌, పాకిస్థాన్ యుద్ధ స‌మ‌యంలో ఐఏఎఫ్ చీఫ్‌గా సేవ‌లు అందించారు. ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తుగా 2016లో వెస్ట్‌బెంగాల్‌లోని ప్ర‌న‌గ‌ర్ బేస్‌కి 'ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్ అర్జ‌న్ సింగ్' అని పేరు పెట్టారు. 
 
ఆయ‌న ఏప్రిల్ 15, 1919లో ల్యాల్లాపూర్ (నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో) జ‌న్మించారు. అర్జన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేస్తూ.. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడుతూ ఓ ట్వీట్ చేశారు. 

 

India mourns the unfortunate demise of Marshal of the Indian Air Force Arjan Singh. We remember his outstanding service to the nation. pic.twitter.com/8eUcvoPuH1

— Narendra Modi (@narendramodi) September 16, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు