హత్రాస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కట్టుదిట్టమైన భద్రత నడుమ అలహాబాద్ హైకోర్టుకు తరలించారు. వీరిని సోమవారం లక్నోలోని హైకోర్టు బెంచ్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ వినీత్ జైశ్వాల్ సమక్షంలో భారీ భద్రత మధ్య వారు కోర్టుకు పయనమయ్యారు.
బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్థరాత్రి వేళ దహనం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, మృతురాలి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టరుతో సహా జిల్లా ఎస్పీ, ఉన్నత వర్గానికి చెందిన కొందరు బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.