కూతురు, అల్లుడిని పరిగెత్తించి వేటకొడవలితో నరికిచంపాడు.. ఎక్కడ?

శనివారం, 6 జులై 2019 (12:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె దళితుడిని పెళ్ళి చేసుకుందన్న కోపంతో ఆమెనూ, ఆమె భర్తను అతి దారుణంగా నరికి చంపాడో తండ్రి. తూత్తుకుడిజిల్లా విలాత్తుపురంకు గ్రామానికి చెందిన షోలేరాజా, జ్యోతిలు రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
జ్యోతి పెళ్ళి తండ్రి అళగర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టారు దంపతులు. రెండు సంవత్సరాల నుంచి ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి అళగర్, తన కుమార్తెతోపాటు అల్లుడునీ కత్తితో అతి దారుణంగా నరికి చంపేసి పరారయ్యాడు. పరారీలో ఉన్న 
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు