అమ్మను చిన్నమ్మ ఏమీ చేయలేదు.. శశికళ మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉంది: నర్సు

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (17:43 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను చిన్నమ్మ శశికళ ఏదో చేసి ఉండవచ్చంటూ వస్తున్న వాస్తవవిరుద్ధమని అమ్మకు నర్సుగా ఉన్న ఆర్. ప్రమీళ వివరించింది. పెద్దమ్మ 'జయలలిత', చిన్నమ్మ 'శశికళ' మధ్య చక్కటి సాన్నిహిత్యం, ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేవని 2001లో జయలలితకు నర్సుగా ఉన్న ఆర్.ప్రమీళ విసాగన్ చెప్పారు. అమ్మ మరణంపై ఇప్పటికీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుండటం సబబు కాదని తెలిపారు.  
 
చిన్నమ్మ పెద్దమ్మ ఏదో చేసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రమీళ వెల్లడించారు. జయలలిత ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు పడకుండా అన్నీ శశికళే స్వయంగా చూసుకునే వారని వివరించింది. 34 ఏళ్ల పాటు జయలలిత వెంటే శశికళ ఉన్నారని, అలాంటప్పుడు జయ మరణానికి శశికళ కారణం కావచ్చన్న ఆరోపణల్లో ఏమాత్రం అర్ధం లేదని తేల్చిచెప్పారు. శశికళకు ఇప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అమ్మ వారసత్వాన్ని చిన్నమ్మ మాత్రమే ముందుకు తీసుకువెళ్లగలదని ప్రమీళ కుండబద్దలు కొట్టారు.

వెబ్దునియా పై చదవండి