పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (08:15 IST)
తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తనని స్పష్టం చేశారు. పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదన్నారు. గాంధీ కుటుంబంపైనా తనకున్న నిబద్ధతను ఎవరైనా ప్రశ్నిస్తే అది వారి భ్రమ అవుతుందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
కాగా, డీకే శివకుమార్ త్వరలోనే పార్టీకి మారబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. దీనికితోడు రాహుల్ గాంధీ ఎవరో తెనకు తెలియదన్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి కోయంబత్తూరులో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఇది సొంత పార్టీలోనే విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.  
 
దీనిపై ఆయన పై విధంగా స్పందించారు. తాను ఎలాంటి షరతులు విధించలేదని, విధించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. కండీషన్లు పెట్టడం, బ్లాక్ మెయిర్ చేయడం తన రక్తంలోనే లేదన్నారు. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం సీనియర్ నేత సిద్ధరామయ్యతో పోటీపడిన విషయం తెల్సిందే. చివరకు అధిష్టానం సర్ది చెప్పడంతో డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు