నాలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

గురువారం, 22 ఆగస్టు 2019 (14:47 IST)
నాలుగు రాష్ట్రాలకు ఢిల్లీలోని కేంద్రవాతావరణశాఖ ‘పిడుగు’లాంటి హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని కేంద్ర వాతావరణశాఖ అధికారులు గురువారం ఉదయం హెచ్చరించారు. 
 
దీంతోపాటు ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవవచ్చని హెచ్చరించారు. 
 
మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, లక్షద్వీప్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని కేంద్ర వాతావరణ శాఖ తన గురువారం విడుదల చేసిన బులిటిన్‌లో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు