అరుదైన శ్వేతనాగు ఓ ఇంట కనబడింది. బెంగళూరులో ఈ అరుదైన దృశ్యాన్ని జనాలు తిలకించారు. అంతే భయాందోళనకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మథికెరె ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి శ్వేతనాగు ప్రవేశించింది. పాము రాకను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు వచ్చేశారు.