దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,393కు చేరిందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. మే 3 తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రామాణిక వ్యవస్థల హెచ్చరికల ప్రకారం కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. ఇయాన్ లిప్కిన్ లాంటి ప్రముఖ సైంటిస్టులైతే.. విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేదాకా మామూలు పరిస్థితి రాబోదని తేల్చేశారు.
ముందుగా పేదలకు తిండిగింజలు పంచి, తలారూ.7500 ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయంపైనే దేశ ప్రజలను ఆకలి నుంచి కరోనా నుంచి కాపాడే అవకాశం వున్నట్లు నిపుణులు అంటున్నారు.