డెంగ్యూ వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ : ఐసీఎంఆర్ డైరెక్టర్

గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:14 IST)
దేశంలో డెంగ్యూ వ్యాక్సిన్‌కు సంబంధించి మ‌రింత విస్తృతంగా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల్‌రామ్ భార్గ‌వ్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాక్సిన్ చాలా ముఖ్య‌మైంద‌ని, కొన్ని డెంగ్యూ స్ట్రెయిన్ల‌పై ప్ర‌స్తుతం దేశంలో అధ్య‌య‌నం సాగుతోంద‌న్నారు. 
 
ఇక కోవాగ్జిన్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు కోవాగ్జిన్ డేటాను పూర్తిగా స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు. ఆ డేటాను డ‌బ్ల్యూహెచ్‌వో ప‌రిశీలిస్తోంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే కోవాగ్జిన్‌కు ఎమ‌ర్జెన్సీ అనుమ‌తిపై డ‌బ్ల్యూహెచ్‌వో నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని డాక్ట‌ర్ బల్‌రామ్ భార్గ‌వ్ తెలిపారు. 
 
పండుగ సీజ‌న్ స‌మీపించింద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు. సామాజిక దూరాన్ని పాటించాల‌న్నారు. మాస్క్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌న్నారు. కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నానియ‌మావ‌ళి ప్ర‌కారం పండుగ‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు