జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం కష్టకాలంలో వున్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ఇరుక్కున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ సీఎం పదవి నుంచి వైదొలిగి, తన భార్య కల్పనా సోరెన్‌ని మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా భూకబ్జా, అక్రమ ఇసుక తవ్వకాల కేసులకు సంబంధించి ఇప్పటికే ఏడు సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేయడంతో ఆయన సీఎం పదవి నుంచి వైదొలగే అవకాశం ఉంది.
హేమంత్ త్వరలో సీఎం పదవి నుంచి వైదొలగవచ్చని, ఆయన భార్య కల్పనను తాత్కాలిక సీఎంగా నియమించవచ్చని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొంతకాలం క్రితం, బీజేపీ కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా అవినీతి ఆరోపణలతో పదవీవిరమణ చేయవలసి వచ్చింది. ప్రస్తుతం మరో బీజేపీ సీఎం కూడా ఇదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.