కేరళ సీఎం విజయన్‌ను కలిసిన కమల్ హాసన్.. ఆ రెండు పార్టీలతో?

సోమవారం, 21 మే 2018 (11:42 IST)
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని కలిశారు. ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావడానికి కర్ణాటక సంఘటన నాంది పలికిందని కమలహాసన్ తెలిపారు.


వినయన్‌తో భేటీకి అఅనంతరం, కమల్ మీడియాతో మాట్లాడుతూ, మక్కళ్ నీది మయ్యం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోయంబత్తూరులో నిర్వహించనున్నామని.. ఈ వేడుకకు కేరళ సీఎంను ఆహ్వానించేందుకు వచ్చినట్లు కమల్ తెలిపారు. కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పాలన బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా కావేరీ జలాల వ్యవహారం గురించి ప్రస్తావించారు. 
 
మరోవైపు అలాగే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకోనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం కావేరి నదీ జలాల అంశంపై కమలహాసన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

పీఎంకే తరపున సీనియర్ నేత అన్బుమణి రాందాస్ హాజరు కావడంపై కమల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే దినకరన్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో రాణించవచ్చునని సన్నిహితులు కమల్‌కు సూచిస్తున్నారని తెలిసింది. అయితే కమల్ హాసన్ ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు