అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు నుంచి రాంనగరలోని ఫామ్ హౌస్‌కు మార్చి, అనుమతులు తీసుకుని ఈ పెళ్లి జరిపించారు. అయినప్పటికీ విమర్శలు వచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు.
పైగా, ఈ వివాహానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కూడా హాజరయ్యారు. అయితే, ఈ వివాహం వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని, ఇందుకోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగిందని వివరణ ఇచ్చారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప అనడం గమనార్హం. కాగా, ఈ వివాహంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర్ డిప్యూటీ కమిషనర్‌కు యడియూరప్ప ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.