మీరు మారరా? కోవిడ్ ఆంక్షలను ధిక్కరిస్తున్న ప్రజలపై కర్నాటక పోలీసులు ఆగ్రహం

శనివారం, 1 మే 2021 (09:29 IST)
ప్రతిరోజూ 35 వేలకు పైగా కోవిడ్ కేసులు. కర్నాటకలో రోజురోజుకీ బెంబేలెత్తిస్తున్న కరోనా. ఐనా ప్రజల్లో మాత్రం ఏమాత్రం చలనం రావడంలేదు. లాక్ డౌన్ విధించినా యధేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. ఒకవైపు కోవిడ్ రోగులతో ఆసుపత్రులు కిక్కిరిపోతున్నాయి. ఇంకోవైపు బెడ్లు లేక అనేకమంది అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ప్రజలను ఎంతగానో బ్రతిమాలాడుతున్నారు. దయచేసి బయటకు రావద్దండీ అని. కానీ కర్నాటక జనం మాత్రం పట్టించుకోవడంలేదు.
 
ఈ నేపధ్యంలో కర్ణాటక డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రవీణ్ సూద్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఆంక్షలను సీరియస్ గా తీసుకుని ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. "లాక్డౌన్ను తీవ్రంగా పరిగణిద్దాం. ఇంతకుమించి కోవిడ్ అదుపుకు మరో మార్గం లేదు." అని సూద్ ట్వీట్ చేశారు.
 
నిన్నరాత్రి ఇరుకుగా వుండే గ్రౌండులో సుమారు 1,000 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "మీ వాహనం లేకుండా ఇంటికి మీరు వెళ్లాలని నేను అనుకోను. పోలీసులతో సహకరించండి, ఇంట్లో ఉండండి. కోవిడ్ గొలుసును విచ్ఛిన్నం చేయండి" అని సూద్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని హెచ్చరించాడు.
 
COVIDని అదుపు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్ 27 రాత్రి నుండి మే 12 ఉదయం వరకు రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో 14 రోజుల లాక్డౌన్ విధించింది. రాష్ట్రంలో రోజుకు 35,000 కేసులు నమోదవుతుండగా, క్రియాశీల కేసులు 3.5 లక్షలకు చేరుకున్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఆక్సిజన్, ఐసియు పడకలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, ఇతర ప్రాణాలను రక్షించే మందుల కొరత తీవ్రంగా వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు