కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే? (video)

సెల్వి

సోమవారం, 28 అక్టోబరు 2024 (21:55 IST)
Kerala CM
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వాహనాలు ప్రమాదానికి గురైయ్యాయి. పినరయి విజయన్ ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో...  ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు గాయాలేమీతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగించారు. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది.
 
రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. కాగా, సీఎం కాన్వాయ్‌కు చెందిన వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

కేరళ సీఎం పినరయివిజయన్ కాన్వ్‌య్‌కి ఆక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం

కేరళ - తిరువనంతపురంలోని వామనపురంలో ఒక స్కూటర్ డ్రైవర్ ఒక్కసారిగా కుడి వైపు తిరగడంతో వెనక నుండి వస్తున్న సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వెయ్యడంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఐదు ఎస్కార్ట్ వాహనాలు… pic.twitter.com/yRvxdeb0Xl

— Telugu Scribe (@TeluguScribe) October 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు