360కి పెరిగిన వయనాడ్ మృతులు.. చిరంజీవి, చెర్రీ, అల్లు అర్జున్ ఆర్థికసాయం ఎంత?

వరుణ్

ఆదివారం, 4 ఆగస్టు 2024 (17:19 IST)
Allu Arjun
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 360 మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో మూడు జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మెప్పాడి, ముండక్కై, చూరల్‌మాలా, ఆట్టమాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ఈ విపత్తు బారిన పడ్డ మలయాళీలను ఆదుకోవడానికి పెద్దఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు చాలామంది. వీరిలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులున్నారు. తాజాగా- మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రామ్‌చరణ్‌‌తో కలిసి తాను కలిసి కోటి విరాళంగా అందజేస్తున్నామని అన్నారు. 
Chiru-Cherry
 
ఇప్పటికే వయనాడులో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఆర్మీ జవాన్లు, సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు