అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో వున్న తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ క్రోనీ క్యాపటలిజం, అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. కొందరు పారిశ్రామికవేత్తలు అధికారవర్గానికి దగ్గరగా ఉండి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
కాగా.. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.