బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుసమాచారం. గడ్డి కుంభకోణంలో ఆయనకు జైలుశిక్ష పడింది. ఆ తర్వాత ఆయన జైలు జీవితానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చని వైద్యులు చెబుతున్నారు.
లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుడు డాక్టర్ ప్రసాద్ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. అయితే లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు.