ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు - అయినా జైలులోనే....

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:28 IST)
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
గడ్డి కుంభకోణం (దాణా స్కాం)లో లాలూ ప్రసాద్ దోషిగా తేలారు. దీంతో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఈ బీహార్ మాజీ ముఖ్యమంత్రికి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇప్ప‌టికే దాణా కుంభ‌కోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు. మ‌రోవైపు దుమ్కా ఖ‌జానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో లాలూకు ప్ర‌స్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం మాత్రం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు