ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

ఠాగూర్

శనివారం, 12 ఏప్రియల్ 2025 (10:22 IST)
కొందరు యువకులు తమ ప్రియురాళ్లను వదిలివుండలేకపోతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఉండే హాస్టల్‌కు తన ప్రియురాలిని తీసుకెళ్లేందుకు పెద్ద సాహసమే చేశాడు. తన ప్రియురాలిని ఓ సూట్ కేసులో బంధించి తన గదికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రయత్నం విఫలమై చివరకు సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రంలోని ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ యువకుడు తన ప్రియురాలిని హాస్టల్ గదిలోకి తీసుకెళ్లేందుకు తెగించాడు. ఆమెను ఓ సూట్‌కేసులో ప్యాక్ చేసి తీసుకెళుతూ సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. దీంతో ఆ ప్రేమ జంటను యూనివర్శిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టుకొని...

హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ యవకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు తెగించాడు. ఆమెను సూట్‌కేసులో ప్యాక్ చేసి తీసుకెళ్తూ సెక్యూరిటీకి దొరికిపోయాడు. వారిద్దరినీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. pic.twitter.com/SlsPu2LeZV

— ChotaNews App (@ChotaNewsApp) April 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు