మరోవైపు, విశాల అటవీప్రాంతం మనదేశ సొంతం. అనేక వన్యప్రాణులకు ఆ అటవీ ప్రాంతం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది.
అసోంలోని కజిరంగా ఫారెస్ట్‌లో ఆ గోల్డెన్ టైగర్ గడ్డిపొదల వెలుపల కూర్చుని సేదదీరుతూ ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. దీనికి స్ట్రాబెర్రీ టైగర్, టాబీ టైగర్ అని ప్రాంతాల వారీగా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ పులికి బంగారు వర్ణం రావడంపై అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్ వివరణ ఇచ్చారు.