చనిపోయిన కోడిపిల్లకు వైద్యం చేయాలని బతిమాలాడు.. చివరికి?

గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:57 IST)
చిన్న పిల్లల మనస్సు నిర్మలమైనది అని రుజువు చేసే ఘటన ఒకటి జరిగింది. మిజోరానికి చెందిన ఆరేళ్ల బాలుడు తన సైకిల్‌పై వెళ్తున్నాడు. ఆ బుడతడి సైకిల్‌కి కోడిపిల్ల అడ్డు రావడంతో దానిని తొక్కించేసాడు. దీంతో కోడిపిల్ల స్పృహ తప్పి పడిపోయింది. ఎలాగైనా కోడిపిల్లను ప్రాణాలతో కాపాడాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. తన వద్దనున్న రూ. 10లతో దానిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
 
ఆస్పత్రిలో ఉన్న నర్సు ఆ కోడిపిల్లను చూసి చనిపోయిందని చెప్పింది. కోడిపిల్లకు వైద్యం చేయలేదు. ఆ పిల్లాడు మళ్లీ ఇంటికెళ్లి.. ఈసారి రూ. 100 తీసుకొని కోడిపిల్లతో ఆస్పత్రికి వచ్చాడు. అది చనిపోయిందని తల్లిదండ్రులు, నర్సులు చెప్పారు. ఆ కోడిపిల్లకు వైద్యం చేసినా కూడా లాభం ఉండదని చెప్పడంతో ఆరేళ్ల బాలుడు చలించిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు