మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లా మన్‌గవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానిక యువతికి ఈ నెల 18న తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చియించారు. వధువుకు బొట్టు పెట్టే తిలకోత్సవ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు అంటే ఈ నెల 16వ తేదీన వధువు తండ్రికి వరుడు ఫోన్ చేశాడు.
కాగా, ఆమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. వివాహం ఆగిపోయి, వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. విచారణ జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.