మధురైలో మాస్క్ పరోటాలు.. జోరందుకున్న అమ్మకాలు..

బుధవారం, 8 జులై 2020 (21:39 IST)
mask parottas
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ అనేది జీవితంలో భాగమైపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ ఓ హోటల్ యజమాని వినూత్న ప్రచారం చేశాడు. 
 
ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి మాస్క్ గురించి అవగాహన కల్పించే రీతిలో తమిళనాడు మధురైకు చెందిన హోటల్ నిర్వహకుడు కె.ఎల్ కుమార్ మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాను తయారు చేశాడు. 
 
కరోనా కారణంగా మధురై జిల్లా అంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో... ప్రజలకు మాస్క్‌లుపై మరింత అవగాహన కల్పించేందుకే ఈ రకరమైన పరోటా మాస్క్ తయారు చేశారని తెలిపాడు. చెన్నై నుంచి అనేకమంది మధురైకి చేరడంతో మధురైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 
 
ఇంకా చాలామంది మాస్కులు ధరించకుండా.. రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కలిగించేలా మాస్క్ ఆకారంలో పరోటా తయారు చేసినట్లు కుమార్ తెలిపాడు. ఈ పరోటాల విక్రయం జోరందుకుంటుందని.. రెండు పరోటాలు 50 రూపాయలకు అమ్ముతున్నట్లు కుమార్ చెప్పుకొచ్చాడు. ఆన్ లైన్ ఫుడ్ యాప్‌లోనూ ఈ పరోటాలను కొనుగోలు చేస్తున్నారని కుమార్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు