వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోర్టు కెక్కారు. ముగిసిన ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో తనపై విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాను గెలుపొందానని.. దానికి గవర్నర్ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.