బీజేపీని ఎదుర్కొనే సత్తా మమతకే వుంది... యూపీఏ పగ్గాలు అప్పగించాల్సిందే..!

గురువారం, 6 మే 2021 (15:22 IST)
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్డీయేతర పార్టీలు కొత్త వాదనను తీసుకొచ్చాయి. 
 
దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా మమత ఒక్కరికే ఉందని, ఆమెకు యూపీఏ పగ్గాలు అప్పగించాలని, యూపీఏ పగ్గాలు ఆమెకు అప్పగిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ను ఓడించవచ్చని ఓ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూపీఏ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. 
 
సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ స్థానంలో రాహుల్ ను నియమించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తిరిగి ఆయనకే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు