వివరాల్లోకి వెళితే, రాజ్‌గఢ్ జిల్లా సుతాలియా ప్రాంతంలో చోటే ఖాన్ అనే వ్యక్తి ఓ దేవాలయం వద్ద గల ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు అర్థరాత్రి సమయంలో ఇలా అసహజ చర్యలకు పాల్పడుతుండగా మహేష్ అగర్వాల్ అనే వ్యాపారి గమనించాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఓ సైకోలా ప్రవర్తించాడు.
ఈ ఘటనపై గ్రామస్తులు నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వెంటనే నిందితున్ని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చోటేఖాన్‌ని అరెస్ట్ చేశారు.